తమిళనాడు పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఆర్థిక నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భారీవర్షాలు, రెండు సార్లు వచ్చిన తుపానులతో తమిళనాడు కుదేలయింది. ఆరు జిల్లాల్లో విపరీతంగా పంట నష్టమైంది.మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. సహాయ పునరావాస సహాయం కింద 67 వేల కోట్ల రూపాయలు అవసరమని డిఎంకె ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. వరద సహాయ నిధులను తమిళనాడుకు విడుదల చేయాలని కోరుతూ ఈ రోజు తాము వాయిదా తీర్మాన నోటీసులు ఇస్తే..లోక్ సభ స్పీకర్ తిరస్కరించారనిడీఎంకే ఎంపీ టీఆర్ బాలు తెలిపారు. ఇందుకు నిరసనగా తమిళనాడులోని అన్ని పార్టీలు, కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాని వాగ్దానం చేసినట్లు వరద సహాయ నిధులను తమిళనాడుకు విడుదల చేయాలనేది బాలు డిమాండ్ చేశారు.
కేంద్రం వివక్షపై గళమెత్తిన తమిళనాడు పార్టీలు
0
410
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


