30.2 C
Hyderabad
Friday, March 1, 2024
spot_img

మనం సూపర్ సోనిక్ యుగంలోకి ప్రయాణం

          సూపర్ సోనిక్ యుగంలోకి మనం ప్రయాణం ఆరంభించినట్లే… అమెరికాకు చెందిన అంతరిక్షసంస్థ నాసా కొత్త సూపర్ సోనిక్ విమానం ఎక్స్ – 59 ను ఆవిష్కరించింది. సూపర్ సోనిక్ విమానం శబ్దవేగం కన్నా 1.4 రెట్ల వేగంతో దూసుకెళ్తుంది.. ఎక్స్-59 సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసింది. దీనిని “సన్ ఆఫ్ కాన్కార్డ్” అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని నాసా, లాక్ హీడ్ మార్టిన్ గత వారం విడుదల చేశాయి. సూపర్ సోనిక్ పాసింజర్ జెట్ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇక ముందు తొలగించేలా అమెరికా ప్రభుత్వ యంత్రాంగాన్ని నాసా ఏమేరకు ఒప్పిస్తుందో చూడాలి. సూపర్ సోనిక్ విమానం 100 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు ఉంటాయి. నాసా, లాక్ హీడ్ మార్టిన్ సంస్థలు ఈ సూపర్ సోనిక్ విమానం ఎక్స్ -59ను రూపకల్పన చేశాయి. కెమెరా మానిటర్స్ వినియోగించి సూపర్ సోనిక్ ను ఆపరేట్ చేస్తారు. గంటకు 1488 కిలోమీటర్ల వేగంతో విమానం దూసుకెళ్లే అవకాశం ఉంది. న్యూయార్క నుంచి సూపర్ సోనిక్ దూసుకెళ్తే.. మూడున్నర గంటల్లో లండన్ చేరే అవకాశం ఉంది. భారీ శబ్దం కారణంగా అమెరికా, ఇతర దేశాలు సూపర్ సోనిక్ విమానాలను నిషేధించాయి. ప్రభుత్వాలు అనుమతిస్తే.. గంటల్లో ప్రపంచం చుట్టిరావచ్చు.

 

Latest Articles

డ్రగ్స్‌ కేసులో హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్‌ క్రిష్‌

        డ్రగ్స్‌ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్‌ క్రిష్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశా రు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్