Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

బిల్కిస్ బానోకు న్యాయం జరిగిందా ?

            బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేసులోని పదకొండుమంది దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ సర్కార్‌కు లేదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది.

బిల్కిస్ బానో కేసులో దోషులైన 11మందికి శిక్ష తగ్గిస్తూ ఇచ్చిన గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2002 అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతేకాదు, ఆమె కుటుంబ సభ్యుల్లో ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం కిందటేడాది నిర్ణయం తీసుకుంది. తాజా తీర్పులో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

బిల్కిస్ బానో కేసు ఏమిటి ?
గోద్రా అల్లర్ల తరువాత గుజరాత్ లో అనేక దారుణాలు జరిగాయి. పెద్ద ఎత్తున గృహ దహనాలు, లూటీలు జరిగాయి. చాలా మంది ప్రాణాలరచేత పట్టుకుని భద్రత ఉందనుకున్న చోటుకు పరుగులు తీశారు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరికీ తెలియని పరిస్థితి. జనం అంతా భయం నీడన బతుకుతున్న రోజులవి.అప్పటి దారుణాల్లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ ఒకటి. 2002 మార్చి మూడో తేదీన ఈ దారుణం జరిగింది. అప్పటికి బిల్కిస్ బానో వయస్సు 21 సంవత్సరాలు. ఆమె అయిదు నెలల గర్భవతి. మారణాయుధాలు చేతపట్టిన దాదాపు పాతిక మంది ఉన్న ఒక గుంపు బిల్కిస్‌పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడింది. అంతేకాదు, బిల్కిస్ కుటుంబానికి చెందిన ఏడుగురిని పాశవికంగా హత్య చేసింది. మూడేళ్ల కూతురిని కూడా గుంపు చంపేసింది. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

సీబీఐ ప్రత్యేక కోర్టు ఏర్పాటు
బిల్కిస్ బానో కేసు విచారణకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసింది. విచారణ పూర్తయ్యాక, 2008 జనవరి 21న మొత్తం 11మందికి జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదు పడ్డవారందరూ … ఆ తరువాత జైలుకెళ్లారు. 15 ఏళ్లకు పైగా వారంతా జైల్లోనే ఉన్నారు. జైల్లో మగ్గుతున్న తమను విడుదల చేయాలంటూ ఈ 11మందిలో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గుజరాత్‌ ప్రభుత్వం ఒక రెమిషన్ కమిటీ ఏర్పాటు చేసింది. 11 మంది దోషులకు శిక్ష నుంచి ఉపశమనం కలిగించాలని సిఫారసు చేస్తూ రెమిషన్ కమిటీ ఒక రిపోర్టును గుజరాత్ సర్కారుకు అందచేసింది. ఈ రిపోర్టు ఆధారంగా,జీవిత ఖైదు అనుభవిస్తున్న 11మంది జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైనవారికి అదేదో ఘనకార్యం చేసినట్లు బంధుమిత్రులు పూలదండలు వేశారు. మిఠాయిలు తినిపించారు. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషుల విడుదలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సంవత్సరాల పాటు జైళ్లలో మగ్గుతున్న ఖైదీల విడుదలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలున్నాయి. రేప్‌ కేసుల్లో దోషులను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ విడుదల చేయరాదన్న నిబంధన కూడా ఈ మార్గదర్శకాల్లో ఉంది. అయితే ఈ నిబంధనను గుజరాత్ ప్రభుత్వం అటక మీదకు ఎక్కించింది. దోషులకు మేలు చేసే ఉద్దేశంతో ప్రత్యేకంగా రెమిషన్ కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దోషులను బయటకు తీసుకువచ్చింది. రెమిషన్ కమిటీని అడ్డం పెట్టుకుని గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వీలు దొరికినప్పుడల్లా మహిళల సాధికారత గురించి గొప్పగా మాట్లాడే ప్రధాని నరేంద్ర మోడీ, ఒక మహిళ బిల్కిస్ బానో విషయంలో అమానుషంగా వ్యవహరించారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. వాస్తవానికి ఖైదీల విడుదలకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెమిషన్ కమిటీలో ప్రముఖులు అందరూ బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

గుజరాత్ నిర్ణయాన్ని సవాల్ చేసిన బిల్కిస్
పదకొండుమంది దోషుల విడుదలపై బిల్కిస్ బానో ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవిస్తున్న గాయాల బాధ మరోసారి చెలరేగిందన్నారు. తన జీవితాన్ని, కుటుంబాన్ని ఛిద్రం చేసిన 11 మంది దోషులు జైలు నుంచి విముక్తులు అయ్యారని తెలిసి, మాటలు రావడం లేదని అప్పట్లో బిల్కిస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో బిల్కిస్ బానో తీవ్ర మనస్తాపానికి గురైంది. దోషులను జైలు నుంచి విడుదల చేయడానికి మార్గం సుగమం చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళలంటే, ఆకాశంలో సగం అంటాం. మహిళల సాధికారత గురించి పెద్ద పెద్ద కబుర్లు చెబుతాం. మహిళల సార్వభౌమాధికారం గురించి లెక్చర్లు దంచుతాం. అయితే పాశవికమైన అత్యాచారం కేసులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలున్నా వాటిని పాలకులు పట్టించుకోకపోవడం దారుణం. ఏమైనా బిల్కిస్ బానోకు ఇప్పటికైనా న్యాయం జరిగినట్లేనా ?

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్