స్వతంత్ర వెబ్ డెస్క్: ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కే వారికి శుభవార్త అందించింది. బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టిఎస్ఆర్టిసి ప్రవేశపెట్టిన లక్కీ డ్రా నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నెల 30 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుక పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్ లోని బాక్స్ లో వేయాలి. ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి పది మందిని ఎంపిక చేసి…. 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున బహుమతులు ఇవ్వనుంది. బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని మరియు సంస్థను ఆదరించాలని కోరుతోందని ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారిక ప్రకటన చేశారు.
నేటి నుంచి TS ఆర్టీసీ బస్సులు ఎక్కే వారికి శుభవార్త..!
0
773
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


