38.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఫిర్యాదు మేరకు కోర్టుకు హాజరైన కేజ్రీవాల్

         లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన ఫిర్యాదుపై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వర్చువల్‌గా రౌస్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. అసెంబ్లీ లో విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజ రు నుంచి మినహాయింపు కోరగా.. కోర్టు అందుకు అంగీకరిం చింది. మరోవైపు కేజ్రీవాల్‌ దరఖాస్తుకు ఈడీ తరఫు న్యాయవాది ఏఎస్‌జీ రాజు సైతం అభ్యంతరం వ్యక్తంచేయలేదు. దీంతో.. మార్చి 16వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు. మరో లిక్కర్‌ కేసులో.. మనీలాండరింగ్ కేసు కింద విచారణకు హాజరు కావాల్సిందింగా కేజ్రీవాల్‌ కు తాజాగా ఆరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19న తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. అంతకు ముందు ఆయనకు ఐదుసార్లు జారీ చేసినా విచారణకు గైర్హాజరు కావడంతోనే ఈడీ కోర్టును ఆశ్రయిం చింది. ఈ తరుణంలో.. ఎల్లుండి విచారణకు హాజరు అవుతారా అనే సస్పెన్స్‌ నెల కొంది.

Latest Articles

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. బావిలో పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, తల్లి సావిత్రిబాయి తన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్