లిక్కర్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన ఫిర్యాదుపై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. అసెంబ్లీ లో విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజ రు నుంచి మినహాయింపు కోరగా.. కోర్టు అందుకు అంగీకరిం చింది. మరోవైపు కేజ్రీవాల్ దరఖాస్తుకు ఈడీ తరఫు న్యాయవాది ఏఎస్‌జీ రాజు సైతం అభ్యంతరం వ్యక్తంచేయలేదు. దీంతో.. మార్చి 16వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు. మరో లిక్కర్ కేసులో.. మనీలాండరింగ్ కేసు కింద విచారణకు హాజరు కావాల్సిందింగా కేజ్రీవాల్ కు తాజాగా ఆరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19న తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. అంతకు ముందు ఆయనకు ఐదుసార్లు జారీ చేసినా విచారణకు గైర్హాజరు కావడంతోనే ఈడీ కోర్టును ఆశ్రయిం చింది. ఈ తరుణంలో.. ఎల్లుండి విచారణకు హాజరు అవుతారా అనే సస్పెన్స్ నెల కొంది.


