ఒకే యువకుడికి నాలుగు ప్రభుత్వ కొలువులు

          ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల. దాని కోసం గంటల తరబడి కష్టపడి చదువుతారు. కానీ కొందరు మాత్రమే ఉద్యోగ సాధనలో సక్సెస్ అవుతారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. ఒక్కో పోస్టుకు వేలల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక్క ఉద్యోగం సాధించటమే కష్టమను కున్న ఈ రోజుల్లో ఓ యువకుడు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా! అనిపించాడు. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన వేణు గోపాల్‌, అరుణ దంపతుల పెద్ద కుమారుడు రంజిత్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అనంతరం సాఫ్ట్‌వేర్ వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివారు. ఏడు నెలల క్రితం రైల్వేశాఖలో టెక్నీషియన్‌గా ఉద్యోగం సాధించాడు. ఆ తర్వాత ఎక్సైజ్‌ పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం కూడా సాధించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 ఫలి తాల్లోనూ సత్తాచాటి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తాజాగా ప్రకటించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి పరీక్ష ఫలితాల్లోనూ రంజిత్ ఉద్యోగం పొందారు. రంజిత్‌ ప్రస్తుతం ఎక్సైజ్‌ పోలీసు కానిస్టేబుల్‌ శిక్షణలో ఉండగా… టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిపారు. నాలుగు ఉద్యోగాలు సాధించిన రంజిత్ ను బంధువులు, గ్రామస్థులతో పాటు పలువురు అభినందించారు.

 

Latest Articles

రష్యా చమురు కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ దాడులు

రష్యా చమురు కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ దాడులు చేసింది. క్రాస్నోడార్‌ క్రాయ్‌, క్రిమియాలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్‌ జనరల్‌ స్టాఫ్‌ చెప్పారు. మరోవైపు రష్యాతోపాటు, రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపైనా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్