ఝార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ చేరింది. బలనిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చారు. తమకు 43 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చంపై సోరెన్ అంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు శామిర్ పేట్‌లోని లియోని రిసార్టుకు చేరుకుంటున్నారు. బల నిరూపణ వరకు ఇక్కడే ఉండనున్నారు. ఈ నెల 5న ఝార్ఖండ్ అసెంబ్లీలో బలనిరూపణ జరగనుంది. బలనిరూపణకు ముందు అప్రమత్తమైన జేఎంఎం, కాంగ్రెస్ కూటమి.. ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు తరలించింది. ఝార్ఖండ్ ఎమ్మెల్యేల కోసం రెండు హోటల్స్ బుక్ చేసిన టీపీసీసీ.. అసెంబ్లీలో బలనిరూపణ వరకు హైదరాబాద్‌లోనే ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు ఉండేలా ప్లాన్ చేసింది. ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యతలను తెలంగాణ మంత్రి పొన్నం చూస్తున్నారు.
హైదరాబాద్‌కు చేరిన ఝార్ఖండ్ రాజకీయం
0
784
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


