ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. నగదు అక్రమ చలామణి కేసులో దర్యాప్తు సంస్థ ఈడీ సోరెన్‌ను అరెస్టు చేసింది. దీనిని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఆయన ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిన్న ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి తదితరులు వ్యూహం మార్చి, నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి వారు తెలిపారు. కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్టు చేసిందని సోరెన్ తన పిటిషన్లో ఆరోపించారు. రాజీనామా సమర్పణకు రాజ్‌భవన్‌కు వెళ్తే అక్కడే అరెస్టు చేయడం అన్యాయమన్నారు.
హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
0
492
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


