ముగిసిన రాజ్యసభ నామినేషన్‌లు

        నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసింది. తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరా రు చేశారు. కాంగ్రెస్‌ నుంచి రేణుకాచౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. బీఆర్ఎస్‌ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఇవాళ నామినేషన్ వేశారు. వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ స్థానానికి కేసీఆర్ నామినేట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలతో చర్చించి రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రవిచంద్ర ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. భారత ఎన్నికల సంఘం తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తోంది, వీటికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ పత్రాల దాఖలుకు ఇవాళ చివరి తేదీ. 

    బీఆర్‌ఎస్‌ ఎంపీలు జే సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో మూడు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఖాళీగాఉన్న మూడు స్థానాల్లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించగా, అసెంబ్లీలో తమకున్న బలం ఆధారంగా బీఆర్‌ఎస్ మూడో స్థానం కోసం పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వద్దిరాజు రవిచంద్ర తెలంగాణకు చెందిన గ్రానైట్ వ్యాపారవేత్త. ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరాడు. రవిచంద్రను 2022 బీఆర్ఎస్ రాజ్యస‌భ సభ్యుడిగా ఖరారు చేసింది. ఈ రాజ్య సభ ఉప ఎన్నికలో ఒకనామినేషన్‌ దాఖలు కావడంతో రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. రాజ్యసభ నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇందులో తెలంగాణ నుంచి మూడు ఖాళీలు ఉన్నాయి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్