వాలెంటైన్స్ డే కానుకగా ‘డియర్ ఉమ’ టీజర్

ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం.. అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం.. దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా ఇప్పుడు సుమయ రెడ్డి తన బహు ముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం త్వరలోనే రాబోతోంది. ఇందులో సుమయ రెడ్డి, దియా మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా.. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్వవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇదొక ప్రేమ కావ్యంలా అనిపిస్తుంది. ప్రేమ ఇచ్చే సంతోషాన్ని, బాధను ఓ దృశ్యకావ్యంగా మలిచినట్టు అనిపిస్తుంది. ‘నా కణాల్లో జీవం నీ కళ్లు.. నా నరాల్లో ప్రవాహాం నీ చూపు’, ‘ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన నిర్వచనం’, ‘అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉండదు.. అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది.. అమ్మాయిలు ఇచ్చే షాక్‌లకు.. అబ్బాయిలకు ఇదే సరైన మెడిసిన్’ అనే డైలాగ్స్ సినిమాలోని డెప్త్‌ను చాటుతున్నాయి.

అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ రాబోతోందని టీజర్‌తో స్పష్టమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజ్ తోట కెమెరామెన్‌గా, రధన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు నటించారు.

నటీనటులు : సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్, కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : సుమ చిత్ర ఆర్ట్స్
నిర్మాత : సుమయ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నితిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ : నగేష్ యూ.జీ
దర్శకుడు : సాయి రాజేష్ మహాదేవ్
సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట
సంగీతం : రధన్
ఎడిటర్ : సత్య గిడుతూరి
పీఆర్వో : సాయి సతీష్

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్