తెలంగాణలో విద్యుత్ డిమాండ్‌కు రెక్కలు ….

       తెలంగాణలో ఇటీవలికాలంలో విద్యుత్ వినియోగం ఎడాపెడా పెరిగింది. అయితే పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ ఏడాది జనవరి రెండో తేదీనాటికి తెలంగాణలో విద్యుత్ వినియోగం 22.86 కోట్ల యూనిట్లు. అయితే ఫిబ్రవరి రెండో తేదీ నాటికి కరెం టు వాడకం 25.87 కోట్ల యూనిట్లకు చేరింది. అంటే సరిగ్గా నెల రోజుల్లోనే కరెంటు వాడకం మూడు కోట్ల యూనిట్లకు పెరిగిందన్నమాట. ఈ నేపథ్యంలో డిస్కంలు భారత ఇంథన ఎక్స్చేంజ్‌లో రోజుకు దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు పెట్టి విద్యుత్ కొంటున్నాయి. అంతేకాదు భారత ఇంథన ఎక్స్చేంజ్‌లో ఒకరోజు ముందుగా డబ్బులు చెల్లిస్తేనే, విద్యుత్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఏరోజుకారోజు సొమ్ములు సర్దుబాటు చేయలేక విద్యుత్ పంపిణీ సంస్థలు నానా ఇబ్బం దులు పడుతున్నాయి.

       తెలంగాణలో ప్రస్తుతం రోజుకు దాదాపు 26 కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ …జెన్‌కోకు చెందిన స్వంత విద్యుత్‌కేంద్రాల నుంచి తొమ్మిది కోట్ల యూనిట్లలోపే ఉత్పత్తి జరుగు తోంది.ఇక మిగిలిన 17 కోట్ల యూనిట్లను బయటి విద్యుత్ కేంద్రాల నుంచి కొనవలసి ఉంటుంది. దీనికి సరపడ డబ్బు లు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు జల విద్యుత్ కేంద్రాల నుంచి వస్తున్న అవుట్‌పుట్ కూడా తగ్గుతోంది. కిందటి ఏడాది ఇదే సమయంలో రాష్ట్రంలోని జలవిద్యుత్ కేంద్రాల నుంచి రోజుకు 50 లక్షల యూని ట్ల మేర కరెంటు వచ్చేది. అయితే ఈ ఏడాది కృష్ణానదిలో తగినంత నీరు లభ్యంగా లేదు. దీంతో పవర్ జనరేషన్ పూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో దాదాపు అరకోటి ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో దాదాపు 37 లక్షలఎకరాల్లో వరిపంట సాగైంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉంటున్నాయి. దీంతో పంటలకు నీరు ఇవ్వడానికి దాదాపు 27 లక్షల వ్యవసాయ బోర్లను రైతులు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగా ణలో రోజువారీ కరెంటు వినియోగం ఆకాశాన్ని అంటుతోంది.

Latest Articles

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్