జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. అరికపూడి గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా మేయర్ పొడియం చుట్టుముట్టారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. హైదరాబాద్ సమస్యలపై చర్చ సందర్భంగా.. GHMCలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. గత ఐదు నెలలుగా స్ట్రీట్ లైట్స్ పునరుద్ధన వ్యవస్థ ఆగిపోయిందని విమర్శించారాయన. స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల క్రైమ్ పెరుగుతోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను తీర్చేందుకే అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారని..కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తీరడం లేదన్నారు. అయితే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ కార్పొరేటర్లు తప్పుబట్టారు. అధికారుల నిర్లక్ష్యానికి, వ్యవస్థలు నిర్వీర్యం కావడానికి గత బిఆరెస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ప్రభుత్వం మారగానే ఎమ్మెల్యే గాంధీకి సమస్యలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. అరికపూడి గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా మేయర్ పొడియం వద్ద కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు.
జీహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కుప్పకూలింది- ఎమ్మెల్యే అరికపూడి
0
403
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


