స్వతంత్ర వెబ్ డెస్క్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన త్వరలోనే తిరిగి తన సొంత గూడైన కాంగ్రెస్లోకి చేరనున్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించే సత్తా ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెస్కే ఎక్కువగా ఉన్నందున ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరుతున్నట్లు తాను విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంపై ఆయన సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకే కాంగ్రెస్లో చాలా మంది నేతలు చేరుతున్నారని అన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరడం గురించి తనతో మాట్లాడలేదని చెప్పారు. డైరెక్టుగా ఆ విషయం అధిష్ఠానంతో మాట్లాడాడని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాకుండా చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి వస్తున్నారని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్లో చేరిక గురించి నా సోదరుడు నాతో మాట్లాడలేదు- కోమటిరెడ్డి
0
850
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


