ఏపీ పీసీసీగా దూకుడు పెంచిన వైఎస్ . షర్మిల

        ఏపీపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల దూకుడు పెంచారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ఏ చిన్న అవకా శాన్నీ వదులుకోవడంలేదు. అదే సమయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకూ గట్టి సమాధానం ఇస్తున్నారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల చేనేత కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. రివర్స్‌ టెండరింగ్‌తో మరింత ఆల స్యం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను చీల్చిందని జగన్‌ ఆరోపించారని…. నిజానికి వైఎస్‌ ఫ్యామిలీ విడిపోవడానికి జగనే కారణమని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఎంతో కృషి చేశానన్న షర్మిల… నాకేంటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా వైసీపీ కోసం పనిచేశానని గుర్తు చేశారు. వైసీపీ గెలుపు తర్వాత జగన్‌ పూర్తిగా మారిపోయారని ఆరోపించారు. జగన్‌ మంచి ముఖ్యమంత్రి అయితే చాలు అనుకున్నానని… వైఎస్‌ రాజశే ఖర్‌రెడ్డి ఆశయాలు కొనసాగిస్తారని ఆశపడ్డానని అన్నారు. కానీ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్నుడు స్పెషల్‌ స్టేటస్‌ కోసం.. ఎంపీలందరం రాజీనామా చేద్దామని అన్న జగన్మోహన్‌ రెడ్డి… అధికారంలోకొచ్చాక స్పెషల్‌ స్టేటస్‌ అనే ఊసే ఎత్తలేదని విమర్శించారు.

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్