నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రజా సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ (Andra Pradesh) ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యంగా మహిళల సాధికారత, చేయూత, రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. ఈ నేపథ్యంలోనే పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan)నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణమస్తు(Kalyanamastu), వైఎస్సార్‌ షాదీ తోఫా (YSR Shadi Tofa) పేరిట అన్ని వర్గాల పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం ఆర్థిక సాయం చేస్తోంది. ప్రతీ ఏటా ఈ మేరకు పేదింటి ఆడపిల్లల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది.

ఇక, 2023 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు 141.60 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం బుధవారం అర్హుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. అది కూడా వధువు తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వెళ్లనున్నాయి. ఇక, గడిచిన 9 నెలల్లో వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద దాదాపు 35,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లో వైఎస్సార్‌ సీపీ (ysrcp) ప్రభుత్వం డబ్బులు  జమచేసింది. అర్హులకు దాదాపు 267.20 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది.
దూదేకుల, నూర్‌ భాషాల విజ్ఞప్తిని మన్నించి వారికి కూడా షాదీ తోఫాతో సమానంగా సాయాన్ని లక్ష రూపాయలకు పెంచి అందిస్తోంది. ఎస్సీలకు వైఎస్సార్‌ కల్యాణ మస్తు కింద లక్ష సాయం చేస్తోంది. ఎ‍స్సీ కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని 1,20,000 రూపాయలకు పెంచి అందిస్తోంది. షాదీ తోఫా కింద మైనారిటీ వర్గాలకు కూడా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందుతోంది. ఎస్టీలకు లక్ష, ఎస్‌టీ కులాంతర వివాహాలకు సాయాన్ని పెంచి 1,20,000 రూపాయలు అందిస్తోంది.

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్