స్వతంత్ర వెబ్ డెస్క్: బాపట్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ట్యూషన్ నుంచి వస్తున్న విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు స్నేహితుడు. చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీలోని ఉప్పలవారిపాలేనికి చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. ఈ ఉదయం ఎప్పట్లానే రాజోలులో ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్ స్నేహితుడు వెంకటేశ్వర్‌రెడ్డి మరికొందరితో కలిసి అతడిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలు ఆర్పి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొందరితో కలిసి వెంకటేశ్వర్‌రెడ్డి తనపై పెట్రోలు పోసి నిప్పు అంటించినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అమర్నాథ్ చెప్పాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాపట్లలో అమానుషం.. స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
0
781
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


