ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కలవనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ భేటీలో బడ్జెట్‌తోపాటు రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించనున్నారు చంద్రబాబు. నవంబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గవర్నర్‌ను కలవనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిణామాలపై కూడా చర్చించే అవకాశముంది.
నవంబర్ 11న ఏపీ బడ్జెట్ సమావేశం జరగనుంది. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. గత ఆర్థిక సంవత్సరం ఏపీ ఆదాయం లక్షా 73వేల 766 కోట్ల రూపాయలుగా ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం 2లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.