Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

జగన్ హయాంలో అభివృద్ధి ఎక్కడ ?

        అభివృద్దిలో మిగతా రాష్ట్రాలతో పోటీపడాలని సహజంగా ఏ ప్రభుత్వమైనా అనుకుంటుంది. దీనికోసం ప్రభుత్వ అధినేతలు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అభివృద్ది విషయంలో తామే నెంబర్ వన్‌గా ఉండాలని ముఖ్యమంత్రులు అందరూ భావిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా అభివృద్ధి అనే అంశాన్ని అటకెక్కించిందన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.

     ఆంధ్రప్రదేశ్‌లో రాయ‌ల‌సీమ‌ ప్రాంతానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రాంతం నుంచి గొప్ప‌గొప్ప రాజ‌కీయ నాయ‌కులు ఉద్భ‌వించారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన నేతనే. అయితే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌డ‌ప బిడ్డ‌ను అని చెప్పుకోవ‌టం త‌ప్ప రాయ‌ల‌సీమ ప్రాంతానికి చేసిన మేలు ఏమీ లేదని సామాన్య ప్రజలు అంటున్నారు. రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభి వృద్ధి ఎక్కడా కనిపించదన్నారు. ప్రధానంగా రాయలసీమ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి పట్టించుకోలేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

  జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయం టున్నారు నీటిరంగ నిపుణులు. అంతేకాదు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి తెలుగుదేశం హయాం లో జరిగిన అన్ని పనులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసిందన్న విమర్శలున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రాయలసీమకు సంబంధించి ఎక్కడా కనీసం ఒక్క ప్రాజెక్టులో ఒక్క శాతం పని కూడా జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్ట్‌ల సంగతి దేవుడెరుగు కనీసం తాగునీరు, సాగునీరు కూడా అందించడం లేదని రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఊళ్లకు ఊళ్లూ ఖాళీ అవుతున్నాయి. సీమ వాసులు పొట్ట చేత పట్టుకుని వలసలు పోతున్నారు. సమీప పట్టణాల్లో కూలి పనులకు, ఇతర జిల్లాల్లో మిర్చి కోతలకు వెళుతున్నారు. ఏ గ్రామం చూసినా ఇళ్లకు తాళాలు వేసే దర్శనమిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు అప్పులపాలయ్యారు.

    ఆంధ్రప్రదేశ్‌లో రహదారులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణ లున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్న విమర్శలున్నాయి. పల్లెలు, అలాగే శివారు గ్రామాల్లో పరిస్థితి ఘోరంగా ఉందంటున్నారు స్థానికులు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అధ్వాన్న పరిస్థితికి నిరసనగా కిందటేడాది తెలుగుదేశం పార్టీ – జనసేన ఉమ్మడిగా ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. తమ ప్రాంతా ల్లో రహదారులపై ఉన్న గుంతల ఎదుట రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. అధ్వానంగా తయారైన రహదారులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలిజేసేలా ఆందోళనకు దిగారు. అంతేకాదు గ్రామాలకు కనెక్టింగ్‌ రహదారులు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. సహజంగా రహదారులు, విద్యుత్‌, నీటి సదూపాయాల కల్పనకు ఎంత భారీగా ఖర్చు పెడితే అంత ఎక్కువగా అలాగే ఆర్థికంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఈ విషయాన్ని జగన్మో హన్ రెడ్డి పట్టించుకోలేదంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు.

    జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఐటీ సెక్టార్‌ బాగా అభివృద్ధి చెందుతుందనీ, ఫలితంగా తమకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆంధ్రప్రదేశ్ యువత భావించింది. ఉద్యోగాల కోసం తాము ఇకనుంచి హైదరాబాద్‌ వెళ్లాల్సిన అవసరం ఉండదని భావించారు. మంగళగిరి లేదా మరో ప్రాంతం ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంటుందని ఆంధ్రప్రదేశ్ యువత ఆశించింది. అయితే ఆంధ్రప్రదేశ్ యువత ఆశలపై నీళ్లు చల్లింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఐటీ సెక్టార్‌ను పూర్తిగా అటకెక్కించింది. దీంతో యువత తీవ్ర అసం తృప్తితో రగిలిపోయింది. ఐటీ సెక్టార్‌లో కొలువుల కోసం హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు వెళ్లడం మొదలెట్టారు.

    స్మార్ట్ సిటీలను జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అమరావతి స్మార్ట్ సిటీ పరిధిలో 21 ప్రాజెక్టులను ఆమోదించారు. ఇందులో 10 ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తిగా వెనక్కి తీసుకుంది. మరో 11 ప్రాజెక్టుల పనులను అసంపూర్తిగా వదిలే సింది. దీనికి నిదర్శనమే ఎక్కడికక్కడే గుట్టలుగా పోగుబడిన విద్యుత్‌ కేబుళ్లు. స్మార్ట్ సిటీలో మౌలిక వసతుల కల్పన కోసం, గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి తెప్పించిన సామగ్రి చివరకు పిచ్చిమొక్కల మధ్య కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర ప్రదేశ్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజుల్లో అందరూ భావించారు. అయితే పారి శ్రామికంగా రాష్ట్రా న్ని అభివృద్ది చేయడానికి సర్కార్ ఎటువంటి చొరవ చూపలేదన్న విమర్శలున్నాయి. అంతేకాదు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు చూసి యూ టర్న్ తీసుకున్నారని ఇండస్ట్రియల్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా వెనక్కి వెళ్లిన కార్ల కంపెనీల పేర్లను ప్రస్తావిస్తున్నారు. ఏమైనా అభివృద్ధితోనే సంక్షేమం ముడిపడి ఉండాలంటున్నారు ఆర్థికవేత్తలు. అప్పుడే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందంటున్నారు. అయితే సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని అటకెక్కించేశారన్న విమర్శలు ఆర్థికవేత్తల నుంచి వినిపిస్తున్నాయి.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్