బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మోదీ దేశానికి ప్రధాని అయ్యారు.. అదానీ ప్రపంచానికి కుబేరుడు అయ్యారని విమర్శించారు. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారని, దీని వల్ల దేశం విచ్ఛిన్నం అవుతుందన్నారు. అయోధ్య రామ మందిరాన్ని నమ్ముకున్న మోదీకి.. మందిరం ఉన్న నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని చెప్పారు. భారత దేశంలో అనేక రాజకీయ మార్పులు సంభవించబోతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోతోందని చెప్పారు.