ఏపీలో జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. బదిలీలలో నాయకులు, అధికారులు ఎవరైనా.. లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలా పైరవీలు చేసి బదిలీలకు ప్రయత్నించినా..బదిలీలు చేయించుకున్నా.. వాటిని తక్షణమే నిలుపుదల చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కొత్తపేట, టెక్కలిలో అన్న క్యాంటీన్‌లు ప్రారంభించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంపై కొన్ని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఫ్రీ బస్ స్కీంపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని..త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు చెప్పారు.