Free Porn
xbporn
29.2 C
Hyderabad
Tuesday, October 8, 2024
spot_img

వరద నష్టాన్ని శివరాజ్‌సింగ్‌కు వివరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు 5 వేల 438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టం వివరాలు సేకరిస్తున్నాయని, సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందని వివరించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, బండి సంజయ్‌. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో నిన్న సచివాలయంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలతో వాటిల్లిన వరద నష్ట తీవ్రతను ముఖ్యమంత్రి వివరించారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు వివరించారు.

మహబూబాబాద్ జిల్లాలో వరదలో కట్ట కొట్టుకుపోవటంతో వేలాడుతున్న రైల్వే ట్రాక్ పరిస్థితిని, రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయారని చెప్పారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధిత కుటుంబాలకు 10 వేలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని అధికారులు వివరించారు.

వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లను కూడా పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరదలతో దెబ్బతిన్న చెర్వులు, కుంటలు తక్షణ మరమ్మతులకు కనీసం 60 కోట్లు అవసరమవుతాయని కోరారు. ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం 4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ నష్టం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయని చెప్పారు. అందుకే ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని అన్నారు. విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు, రాజకీయాలకు తావు లేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు. కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుందని అన్నారు.

Latest Articles

హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీ

హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య ఫైట్ ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. తాజా స‌మాచారం ప్రకారం బీజేపీ కూట‌మి ఆధిక్యంలో ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ఫలితాల సరళి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్