ఏదో ఒక వ్యవహారంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ పోరు కొనసాగుతూనే ఉంది. పోటాపోటీ కార్యక్రమాలు సర్వసాధరణమయ్యాయి. అయితే,.. ఇటు పార్టీ ముఖ్య నేతల మధ్యే కాదు.. అటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లాలో భూమి పూజ కార్యక్రమం ఇరు పార్టీల మధ్య మంట పెట్టింది. హస్తం, గులాబీ శ్రేణులు పోటీకి దిగడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
దుబ్బాక బస్టాండ్ వద్ద దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు బీజేపీ శ్రేణులు. అయితే,.. అదే చోట దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ ముదిరింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా మోహరించిన ఖాకీలు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను సముదాయించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.