విజయవాడ వరదలపై మాజీ సీఎం జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే..జగన్ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు డ్రోన్లు వినియోగించి బాధితులను ఆదుకుంటున్నా..జగన్‌కు నచ్చడంలేదన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా అయిన పద్ధతి మార్చుకోలేదని చెప్పారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే మరోసారి ప్రజాగ్రహానికి జగన్ గురికాకతప్పదని రామ్మోహన్ నాయుడు తెలిపారు.