కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. చేనేత కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులకు సరిపడా పని కల్పించిందని… అసలు బతుకమ్మ చీరలను ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు ఉపాధి లభించిందని ఆయన పేర్కొన్నారు.