గత ఐదేళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బడ్జెట్‌పై శాసనసభలో ఆయన మాట్లాడారు. వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని తెలిపారు. దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థలను కూడా నాశనం చేశారని అన్నారు. స్కామ్‌ల కోసమే స్కీమ్‌లు అమలు చేశారని ఆరోపించారు. అమరావతి గొప్ప నగరంగా తయారు కాకుండా ఐదేళ్లు అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని దెబ్బతీశారు. నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే రెండేళ్లపాటు పట్టించుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయని సీఎం అన్నారు.