అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం భైరవాని తిప్ప రిజర్వాయర్‌కు నీళ్లు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రాజెక్టులో నీరు లేక బీటలుగా మారింది. మూడు రోజులుగా కర్ణాటక సరిహద్దుల్లో భారీగా వర్షాలు కురవడంతో పరివాహక ప్రాంతం నుంచి రిజర్వాయర్‌కు నీరు సరఫరా అవుతోంది. మరోవైపు నియోజకవర్గం లోని గుమ్మగుట్ట మండల సమీపంలో 1958లో వేదవతి నదిపై బీటీ ప్రాజెక్టు నిర్మించారు. దీంతో పలు గ్రామాల్లో 8వేల ఎకరాలు, కళ్యాణదుర్గం, బ్రహ్మ సముద్రం మండలంలోని 4వేల ఎకరాలకు సాగు నీరు అందేది. కర్ణాటక సరిహద్దుల్లోని అక్కడి ప్రభుత్వం చెక్ డ్యామ్‌లు, కుంటలు నిర్మించడంతో నీటి సరఫరా తగ్గింది. ఉపాధి లేక ప్రజలు వలసల బాట పడుతున్నారు. రెండు దశాబ్ధాలుగా ప్రభుత్వాలు మారినా హంద్రీనీవా, జీడీపల్లి రిజర్వాయర్ నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టు సాగునీరు అందించే దిశలో విఫలం అయ్యాయి. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
భైరవానితిప్ప రిజర్వాయర్‌కు నీళ్లు ….. రైతుల హర్షం
0
204
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


