తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్‌రావుపై నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. CRPC 73 సెక్షన్ కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసు కస్టడీలో అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరిం చారని దర్యాప్తు బృందం గుర్తించింది. కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ ఎయిర్‌పోర్టులో దిగినా పట్టుకునేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు, ఇంటర్‌పోల్ అధికారులను దర్యాప్తు బృందం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో CRPC 73 ద్వారా పోలీసులు అరెస్టు వారెంట్ తీసుకు న్నారు.
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అరెస్టుకు వారెంట్ జారీ
0
473
Previous article
Next article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


