పవన్ కళ్యాణ్ కు ప్రేమతో ఓటు వేశారు – నాగబాబు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణకు పిఠాపురం ఓటర్లు ప్రేమతో ఓటేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన సోదరుడు నాగబాబు. అభిమానం, ఇష్టం కంటే ప్రేమ అధికమన్న ఆయన ఆ ప్రేమను పిఠాపురం ఓటర్లు చూపించారని కొనియాడారు. క్షేత్రస్ధాయిలో పార్టీ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానుల శ్రమ వెలకట్టలేనిదన్నారు. అభిమానంతో ఓటు వేయడం వేరు.. ఇష్టంతో ఓటు వేయడం వేరు.. కానీ.. ప్రేమతో ఓటు వేయడం సంతోషంగా ఉంటుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ పోటీ చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అలుపెరగని పోరాటపటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు అని నాగబాబు తెలియచేశారు.

సాధారణంగా నియోజకవర్గ అభ్యర్ధి గెలుపు కోసం పోరాటం చేయడమే కష్టం కానీ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ఒత్తిడి ఏర్పడిందనేది వాస్తవం. అయినా వారు ముందుకు నడిచారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరి సేవను ప్రశంసిస్తున్నా. మండల, పట్టణ, వార్డు స్థాయిలో కమిటీలుగా ఏర్పడి పవన్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తాం అని నాగబాబు పేర్కొన్నారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్