జనసేన అధినేత పవన్ కళ్యాణకు పిఠాపురం ఓటర్లు ప్రేమతో ఓటేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన సోదరుడు నాగబాబు. అభిమానం, ఇష్టం కంటే ప్రేమ అధికమన్న ఆయన ఆ ప్రేమను పిఠాపురం ఓటర్లు చూపించారని కొనియాడారు. క్షేత్రస్ధాయిలో పార్టీ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానుల శ్రమ వెలకట్టలేనిదన్నారు. అభిమానంతో ఓటు వేయడం వేరు.. ఇష్టంతో ఓటు వేయడం వేరు.. కానీ.. ప్రేమతో ఓటు వేయడం సంతోషంగా ఉంటుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అలుపెరగని పోరాటపటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు అని నాగబాబు తెలియచేశారు.
సాధారణంగా నియోజకవర్గ అభ్యర్ధి గెలుపు కోసం పోరాటం చేయడమే కష్టం కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ఒత్తిడి ఏర్పడిందనేది వాస్తవం. అయినా వారు ముందుకు నడిచారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరి సేవను ప్రశంసిస్తున్నా. మండల, పట్టణ, వార్డు స్థాయిలో కమిటీలుగా ఏర్పడి పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తాం అని నాగబాబు పేర్కొన్నారు.