31.2 C
Hyderabad
Friday, July 12, 2024
spot_img

మందు కొడదాం రండి

కాంట్రావర్సీ పిక్ షేర్ చేసిన టాప్ హీరో విజయ్ దేవరకొండ * మందు కొడుతున్న పిక్ రిలీజ్

టాప్ హీరో విజయ్ దేవర కొండ మరో వివాదాన్ని రాజేశారు. కొంత కాలంగా మీడియాను తన వైపు తిప్పుకొనేందుకు విజయ్ దేవర కొండ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ వివాదాన్ని రేపారు. కవ్వింతలతో దుమ్ము రేపేందుకు ప్లాన్ చేశారు.

కొత్త  సంవత్సరంలో మొదటి రోజున మిట్ట మధ్యాహ్నం పూట ఇన్ స్టా గ్రామ్ లో ఒక పిక్ షేర్ చేశారు. బీచ్ లో అర్థ నగ్నంగా స్నానం చేస్తున్న ఫోటో పోస్టు చేశారు. చేతిలో మద్యం సీసా పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం రమ్మంటూ కవ్విస్తున్నారు. ప్రతీ దానిని ఎంజాయ్ చేయాలని, ఎందుకంటే జీవితంలో ప్రతీదీ భాగమే అంటూ కొటేషన్ వదిలారు. అందరికీ శుభాకాంక్షలు అంటూ లవ్ కొటేషన్స్ కూడా జోడించారు.

విజయ్ దేవర కొండ అంటే పడి చచ్చిపోయే యూత్ కు కొదవే లేదు. అందమైన హీరో కలర్ ఫుల్ ఫోటో రిలీజ్ చేసే సరికి గంటలోనే వైరల్ చేసేశారు. ఒక్క గంటలోనే 11 లక్షలకు పైగా లైక్ లు వచ్చి పడ్డాయి. కుప్పలు తెప్పలుగా  కామెంట్స్ , రిప్లయ్ లు మోతెక్కుతున్నాయి. కానీ, మందు కొడదాం రమ్మంటూ కవ్వించటం హీరో లకు తగని పని సోషల్ మీడియాలో కొందరు విజయ్ దేవర కొండను విమర్శిస్తున్నారు.

Latest Articles

కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగిన షర్మిల

కూటమి సర్కార్ పై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వందల కోట్లు ఇచ్చి.. అభివృద్ధి చేసింది కేవలం దివంగత వైఎస్ఆర్ మాత్రమేనని.. ఆ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్