కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందా..? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. సోషల్ మీడియాలో మంత్రిపై ప్రచారమవుతున్న వీడియోల అంశంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పార్టీ నేతలు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సహా మరికొందరు కంప్లైంట్ చేశారు. కొందరు కావాలనే కేంద్రమంత్రిపై విమర్శలు చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా సొంత పార్టీ నేతల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇలాంటి ప్రచారం ఎవరు చేసినా సరే చూస్తూ ఉరుకునేది లేదంటున్నారు బీజేపీ నేతలు.