మీడియాతో మాట్లాడిన ఉపాసన – రామ్ చరణ్ దంపతులు

స్వతంత్ర వెబ్ డెస్క్: మెగా హీరో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తమ బిడ్డతో కలిసి మీడియా ముందుకి వచ్చారు. కాసేపటి క్రితం ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తల్లి, బిడ్డ ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని, ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి భయం లేదని అన్నారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవని చెప్పారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని అన్నారు. బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా అన్నీ నాన్న పోలికలే అని చెప్పారు. పాపకు ఏం పేరు పెట్టాలనేది తాను, ఉపాసన నిర్ణయించామని, 21వ రోజున ఆ పేరును తానే వెల్లడిస్తానని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినప్పుడు అందరు తండ్రుల మాదిరే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.

ఈ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత చరణ్ తండ్రి కావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుతోంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత చరణ్ తండ్రి కావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుతోంది

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్