భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారు: ఎంపీ అవినాష్ రెడ్డి

MP Avinash Reddy Comments | ఏపీ మాజీ మంత్రి వివేకా హత్యకేసుకు  సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసిందని.. సిల్లీ విషయాలను సీరియస్‌గా తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారని.. కనీసం మాట్లాడడానికి కూడా మాటలు రావడం లేదన్నారు. ఏదేమైనా ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటామని మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ కేసు సంబంధించి పాత అధికారి చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతోందని అన్నారు. మేం చెప్పినా అంశాలను పరిశీలించడం లేదన్నారు. వివేకా హత్య కేసు విషయాన్ని ముందు పోలీసులకు చెప్పిందే నేను.. ఘటనాస్థలికి తొందరగా రావాలని పోలీసులకు 3 సార్లు ఫోన్ చేశానని అన్నారు. వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

2010లో మహ్మద్ అక్బర్‌గా వై ఎస్ వివేకా పేరు మార్చుకున్నారని అన్నారు. వివేకాకు షెహన్‌షా అనే కుమారుడు ఉన్నాడని.. రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారని మంత్రి వివరించారు సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయన్నారు. సునీత, సీబీఐ ఒక్కటేనని… సునీత చంద్రబాబుతో చేతులు కలిపారని ఆరోపించారు. ఏడాది వరకు ఒకలా ఉన్నా, ఒక్కసారిగా సునీత వెర్షన్‌ మారిందని అన్నారు. హత్య విషయం నాకంటే ముందు వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అవినాష్ రెడ్డి.

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్