TSRTC నోటిఫికేషన్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్!

స్వతంత్ర వెబ్ డెస్క్: టెన్త్, 8వ తరగతి విద్యార్హత కలిగిన వారికి గుడ్ న్యూస్. వరంగల్‌లోని TSRTC ఐటీఐ కళాశాల వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో అడ్మిషన్లను నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ దరఖాస్తుకు ఈ నెల ౩1ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలను సంస్థ ఏర్పాటు చేసింది.
నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం కలిగిన ఆర్టీసీ అధికారులచే తరగతులను నిర్వహిస్తోంది సంస్థ. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్‌ సౌకర్యం కల్పించనున్నారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు వరంగల్‌ ములుగు రోడ్డులోని టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించాలని ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.

Latest Articles

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్