లొట్టపీసు కేసులో ఏదో దొరకబడదామని ప్రయత్నం- వేముల ప్రశాంత్‌ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడ నెరవేర్చలేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏదో జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చిల్లర పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని ప్రశాంత్‌ రెడ్డి గ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చింది కేటీఆర్ అని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేస్ రద్దు చేసింది రేవంత్ రెడ్డి అని అన్నారు. లొట్టపీసు కేసులో ఏదో దొరకబడదామని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసులో ఏం దొరకలేదని ఎలక్టోరల్ బాండ్లు తెరపైకి తెచ్చారని చెప్పారు. దేశంలో అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని.. ఫార్ములా ఈ రేస్ నిర్వహించి గ్రీన్ కో కంపెనీ నష్టపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1,509 కోట్ల రూపాయలు సంపాదించిందని .. కాంగ్రెస్ పార్టీ క్విడ్ ప్రోకో చేసి ఎలక్టోరల్ బాండ్లు తెచ్చుకుందా.. అని ప్రశ్నించారు. కేటీఆర్ చట్ట ప్రకారం ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటారని వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్