హీరో విక్టరీ వెంకటేష్ చిన్నాన్న, తెలుగు చిత్రసీమ లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… ఈరోజు ప్రకాశం జిల్లా కారంచేడులో తుదిశ్వాస విడిచారు. దీంతో విషయం తెలుసుకున్న నిర్మాత దగ్గుబాటి సురేష్ కారంచేడు చేరుకుని ఘన నివాళి అర్పించారు. కాగా, రేపు మోహన్ బాబు అంత్యక్రియలు జరుపనున్నట్లు దగ్గుబాటి కుటుంబ సభ్యులు తెలిపారు. అంతిమ సంస్కారానికి హీరోలు వెంకటేష్, రానా సహా దగ్గుబాటి కుటుంబీకులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మరికొందరు ఆయన ఇంటికి చేరుకొని ఆత్మీయతను చాటుతూ నివాళులర్పిస్తున్నారు.
బ్రేకింగ్: స్టార్ హీరో వెంకటేష్ ఇంట్లో విషాదం
0
310
Previous article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


