డిసెంబర్ 2న యూసూఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోయే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు మ్యాప్ ను పోలీసులు విడుదల చేశారు. రూట్ మ్యాప్ లు వివరాలు ఇలా ఉన్నాయి. 1).అమీర్పేట నుండి జూబ్లీ చెక్ పోస్ట్ , మాదాపూర్ వైపు వెళ్లే వారు యూసఫ్ గూడ బస్తీ వద్ద శ్రీనగర్ కాలనీ గుండా వెళ్లవచ్చు.. 2).జూబ్లీ చెక్ పోస్ట్ నుండి యూసుఫ్ గూడ వెళ్ళేవారు కృష్ణానగర్ నుండి శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట వైపుగా వెళ్లవచ్చు.. 3).యూసూఫ్ గూడ నుండి బోరబండ వైపు వెళ్ళేవారు కృష్ణకాంత్ పార్క్ వైపుగా జిటిఎస్ టెంపుల్ మీదుగా వెళ్లవచ్చని పేర్కొన్నారు.
ఈవెంట్ కు వచ్చే వారికి కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. కార్ల కొరకు… సవేర , మహమూద్ ఫంక్షన్ హాల్ వద్ద చేసుకోవచ్చు.. జానకమ్మ తోట వద్ద బైక్లు పార్క్ చేసుకోవచ్చు.. ట్రాఫిక్ మళ్లింపు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి కార్యక్రమం ముగిసే వరకు అమలులో ఉంటుంది. పై మార్గంలో ప్రయాణించే వారు తప్పనిసరిగా గమనించగలరు అని ప్రకటనలో పేర్కొన్నారు.