సిద్దిపేట జిల్లాలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో వేయి కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన.. కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును ఆయన ప్రారంభించనున్నారు. కోకో కోలా, థమ్స్ అప్ శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బీవరేజెస్ సంస్థ.. ఇటీవలే తిమ్మాపూర్ ఫుడ్‌పార్క్‌లో భారీ బాట్లింగ్ యూనిట్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ ప్లాంట్‌ను మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి ఉద్యోగాలు లభించే అవకాశముంది.