లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో ఉదయం ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు దాదాపు చివరి గంటన్నర వరకు అదే బాటలో పయనించాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న మార్కెట్లు చివరి అరగంటలో స్పష్టమైన లాభాల్లోకి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లో ముగియడం విశేషం. ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 63,328కి చేరుకుంది. నిఫ్టీ 61 పాయింట్లు పుంజుకుని 18,817కి పెరిగింది. పవర్, ఆటో, ఐటీ, టెలికాం, టెక్ తదితర సూచీలు లాభాలను ఆర్జించగా.. ఫైనాన్స్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర సూచీలు నష్టపోయాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, విప్రో, నెస్లే ఇండియా, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

Latest Articles

క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్‌ చేస్తున్నారు- స్పీకర్‌

అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్