ఎంఆర్ఎఫ్ ఒక్కో షేరు విలువ రూ.1లక్ష

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్రను సృష్టించింది. ఎంఆర్ఎఫ్ ఒక్కో షేరు రూ.1లక్ష మార్కును దాటింది. ఫలితంగా భారతదేశంలో రూ. 1లక్ష మార్క్ దాటిన తొలి స్టాక్‌గా ఎంఆర్ఎఫ్ అవతరించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎంఆర్ఎఫ్ షేరు అధిక స్థాయిలో ప్రారంభమై 1.48శాతం పెరిగి కొత్తగా 52వారాల గరిష్ట స్థాయి రూ. 1,00,439.95ను తాకింది. బీఎస్ఈలో ఎంఆర్ఎఫ్ ఒక్కో షేరుకు రూ. 1,00,300 రికార్డు స్థాయిని తాకింది. తర్వాత కాస్త దిగొచ్చి మధ్యాహ్నం 12.09 గంటల సమయంలో 0.79 శాతం లాభంతో రూ. 99.75 వద్ద ట్రేడవుతోంది. 2021 జనవరిలో ఈ కంపెనీ స్టాక్ తొలిసారి రూ. 90వేల మార్క్ ఎగువన ముగిసింది. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయి మార్క్‌కు చేరుకోలేదు. తాజాగా ఇప్పుడు లక్ష మార్కునుదాటి భారతదేశంలో రూ. 1లక్ష మార్క్ దాటిన తొలి స్టాక్‌గా ఎంఆర్ఎఫ్ అవతరించింది. దీపావళి నాటికి స్టాక్ రూ. 1.25లక్షలకుసైతం చేరుకొనే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Latest Articles

‘జెన్ జీ’ఓటర్లను ఆకర్షించలేకపోతున్న కాంగ్రెస్

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'జెన్ జీ' ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యత్వ నమోదుతో దూసుకుపోతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్