స్వతంత్ర, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రవాస భారతీయులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ దాకా ఓ ట్రక్కులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో ట్రక్కు డ్రైవర్లు ఎలా పని చేస్తారు? ట్రక్కు ఫీచర్లు ఏమిటి? వారికి చలాన్లు పడతాయా? డ్రైవర్లు ఎంత ఆదాయం సంపాదిస్తారు? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. నెలకు రూ.8లక్షల దాకా సంపాదిస్తామని డ్రైవర్ చెప్పడంతో రాహుల్ ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను 2.25 లక్షల మందికి పైగా చూడగా.. 36 వేల మంది లైక్ చేశారు. కాగా గత నెలలో ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు కూడా ఓ లారీలో ప్రయాణించిన సంగతి తెలిసిందే.
వాషింగ్టన్ టూ న్యూయార్క్‌కు ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ గాంధీ
0
335
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


