Mark Antony: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈ సినిమా ఒక లెక్క: విశాల్

ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన సుస్థిర స్థానం దక్కించుకున్న హీరో విశాల్. నేడు ఆయన పుట్టినరోజు(ఆగస్ట్ 29). ఆయన త్వరలోనే ‘మార్క్ ఆంటోని’ అనే చిత్రంతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రాబోతున్న తన కొత్త సినిమా గురించిన సంగతులను ప్రత్యేకంగా వివరించారు. ‘‘ఈ బర్త్ డే నాకెంతో స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే రానున్న సెప్టెంబర్ 15న ‘మార్క్ ఆంటోని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటి వరకు నేనేన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాల్లో నటించాను. ఆడియెన్స్ నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే వచ్చారు. వారు అందించిన ఆదరాభిమానాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నాపై ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రేక్షకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.

‘మార్క్ ఆంటోని’ విషయానికి వస్తే నా కెరీర్లో ఇదెంతో ముఖ్యమైన సినిమా. పీరియాడిక్ మూవీ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాను. ఆ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్‌కి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓ కీలకమైన పాత్రలో ఎస్.జె.సూర్యగారు నటించారు. జి.వి.ప్రకాష్ గారు సంగీతాన్ని అందిస్తున్నారు. జి.వి. మ్యూజిక్‌తో పాటు అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ.. పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ ఫైట్స్ హైలైట్. థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు ఎలాంటి సినిమాను చూడాలనుకుంటున్నారో అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయి. తప్పకుండా ఆడియెన్స్‌కి ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్‌ను మార్క్ ఆంటోని మూవీ ఇస్తుంది. మీ ప్రేమ, అభిమానాలుంటే ఇలాంటి సినిమాలను ఇంకా మరెన్నింటినో చేసి మిమ్మల్ని మరింతగా అలరిస్తానని చెబుతున్నాను.’’ అని విశాల్ వెల్లడించారు.

Latest Articles

జార్ఖండ్‌ రాంచీలో టెన్షన్ టెన్షన్

విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ చేపట్టిన జార్ఖండ్‌ బంద్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాంచీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రోడ్డుపై టైర్లు కాల్చేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్