నెట్టింట వైరల్ అవుతున్న చిరంజీవి,పవన్‌,మోదీల వీడియో

   చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్‌ అవుతోంది. స్టేజ్‌ పై ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చిన మోదీ.. మెగా బ్రదర్స్‌ చేతులు పట్టుకొని అభివాదం చేశారు. ఈ సమయంలో ఆయన ఏం మాట్లాడారో చిరు పోస్ట్‌ పెట్టారు.

   తనతో, తమ్ముడితో ప్రధాని నరేంద్ర మోదీ వేదికపై మాట్లాడడం చాలా ఆనందానిచ్చిందని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసినట్లు చెప్పారన్నారు. కుటుంబసభ్యులు. ప్రత్యేకించి తమ అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలు ఆ వీడియోలో కనిపించాయన్నారు. ఆ దృశ్యాలు మన సంస్కృతి సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబిం చాయని మోదీ అభినందించారని చిరంజీవి తెలిపారు. ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. ప్రధాని అలా మాట్లాడడం నాకెంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. వారి సునిశిత దృష్టికి నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోదీతో జరిగిన సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకమని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్‌ను నెటిజన్లు, అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్