కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు

   సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఈనెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే అధికార బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ప్రచారం చేపడుతున్నారు. అలాగే అభ్యర్థుల లిస్టు కూడా రెడీ అయిపోయింది. మరికొన్ని గంటల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమవుతోంది. వచ్చే వారం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది. మరోవైపు మార్చి 4న మేనిఫెస్టో కమిటీ కూడా సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇవ్వబోయే హామీలు, పథకాలపై చర్చించనుంది.ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే ఆయా పార్టీలతో కాంగ్రెస్‌ చర్చలు జరిపింది. సీట్లు సర్దుబాటుపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం. మరో వైపు దేశ వ్యాప్తంగా భారత్ జోడో న్యాయ పేరుతో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ప్రజలను చైతన్య వంతుల్ని చేస్తున్నారు. ఇండియా కూటమిని గెలిపించాలని కోరుతున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్