వీడని సస్పెన్స్‌.. జనగామలో కారు స్టీరింగ్ తిప్పేదెవరో..?

స్వతంత్ర వెబ్ డెస్క్: జనగామ బీఆర్‌ఎస్‌(BRS) టికెట్‌పై సస్పెన్స్‌ కొనసాగుతున్నది. కేసీఆర్‌ సోమవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికీ జనగామ(Jangaon) స్థానాన్ని పెండింగ్‌ పెట్టారు. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Muthireddy Yadagiri Reddy) ఆలోచనలో పడిపోగా, అతడి వర్గీయులు నైరాశ్యానికి లోనయ్యారు. జనగామ స్థానంపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy), స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) ఆశించి ఎవరికి వారుగా వ్యవహరిస్తుండటంతో వివాదాలు తలెత్తాయి.
దీంతో నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పరిశీలన కోసం పెండింగ్‌ పెట్టారు. పార్టీ అంచనాలు, సర్వేలు, అంతర్గత అవగాహనతో వడబోత చేపట్టి మరో రెండు, మూడురోజులలో నిర్ణయం తీసుకుని అభ్యర్థిని వెల్లడిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన క్రమంలో జనగామ టికెట్‌ ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ముత్తిరెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ విషయమై సోమవారం ఎమ్మెల్సీ కవితను ఆయన కలిసినట్లు తెలిసింది. అయితే సీఎం కేసీఆర్‌పై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదేశానుసారం నడుకుంటానని తెలిపారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్