Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

బిఆర్ఎస్ క్యాడర్ నిస్తేజంలో ఉండడానికి కారణం..?

ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై బిఆర్ఎస్ శ్రేణులు మౌనంగా వున్నారా…? ప్రేక్షకపాత్రకు పరిమితం అయ్యారా…? తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారా? జాగృతి శాఖల రద్దుతో కవితకు మద్దతు లభించలేదా…? ఆందోళనలకు పిలుపునిచ్చినా.. ముందుకు వచ్చే వారే లేరా.. మరో పక్క సీనియర్ నాయకులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి వేరేపార్టీల్లో చేరారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, ఆదూరి వంటినేతల వలసలతో కేడర్ పరేషాన్ లో ఉన్నారు. పార్టీ క్యాడర్ నిస్తేజంలో వుండటానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే కారణమా…?

ఆమె మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కుమార్తె. అధికారం ఉన్నప్పుడు ఆమె పార్టీ శ్రేణులకు అధికార కేంద్రంగా వున్నారు. హల్ చల్ చేశారు. కానీ అధికారం కోల్పోయాక సీన్ రివర్స్ అయింది. ఆమె ఎవరో కాదు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరయ్యారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, బతుకమ్మ పండుగల ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో 2014 లో నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక వైపు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు జాగృతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చిన ఈడీ అధికారులు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అరెస్టు సమయంలో ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద బిఆర్ఎస్ కార్యకర్తల హడావుడి కనిపించలేదు అదే విధంగా జాగృతి కార్యకర్తలు సైతం కనిపించలేదు. కవిత అరెస్టుకు రెండు రోజుల ముందు జాగృతి కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకున్నారు. అనేకమందికి ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించారు. పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించలేకపోయారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నేతలు మళ్లీ తమ దారి తాము చూసుకుంటున్నారు. సాక్షాత్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను అరెస్టు చేస్తే పెద్ద ఆందోళనలు చేయాల్సిన శ్రేణులు సైలెంట్ అవడం చర్చకు దారి తీసింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు మినహా మిగతా వారు కవిత నివాసం వద్దకు రాలేదు. దీంతో పార్టీ నిర్మాణం లేకపోవడమే బిఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. .ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత రోజు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది గులాబీ అధిష్టానం. అయినా ఒకటి, రెండు నియోజకవర్గాల్లో మినహా పెద్దగా ఎక్కడా గులాబీ శ్రేణులు ఆందోళనల్లో పాల్గొనలేదు. వారి అవసరం వున్నప్పుడు పార్టీ అధిష్టానం నేతలను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు.ఇప్పుడు కష్టకాలంలో క్యాడర్ గుర్తుకు వచ్చిందా ? అనే ప్రశ్న గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉత్పన్నమవుతోంది. బిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం కవిత అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేయలేదు. అరెస్టు అయ్యేందుకు రెండు రోజుల ముందు జాగృతి కమిటీలను రద్దు చేయడంతో తన స్వంత సంస్థ అయిన జాగృతి కార్యకర్తలు సైతం అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు.

మొత్తానికి కీలకంగా మారిన ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో బిఆర్ఎస్ శ్రేణులు ముందుకు రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్