భద్రచలం వద్ద గోదావరి ఉదృతిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియ, గోదావరి కరకట్ట వద్ద వరద ఉదృతి, కొత్త కరకట్ట నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం నీటి పారుదల, పంచాయతీ, ఆర్‌అండ్ బీ, అగ్రికల్చర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. గోదావరిలో నీటి ప్రవాహం 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు వరద ఉదృతిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.