KTR : అసలైన సినిమా ప్రతిపక్షాలకు 2023లో చూపిస్తాం

స్వతంత్ర వెబ్ డెస్క్: స్టీల్ బ్రిడ్జ్(Steel Bridge) ప్రారంభం వల్ల దశాబ్దాల కల నెరవేరిందన్నారు కేటీఆర్(KTR).  ఈ బ్రిడ్జ్ కు నాయిని నర్సింహారెడ్డి(Nayini Rarasimha Reddy) పేరు పెట్టాలని కేసీఆర్(KCR) స్వయంగా చెప్పారన్నారు.   కార్మికులకు అండగా నిలబడ్డ నాయకుడు, తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అని కొనియాడారు.

సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్(RTC X ROAD) దగ్గర వచ్చేది కాదని.. ప్రతిపక్షాలకు 2023లో  అసలైన సినిమా చూపిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఈ సారి కూడా  బ్రహ్మాండమైన విజయంతో మూడోసారి కేసీఆర్ సీఎం కాబోతున్నారని చెప్పారు.  మతాలతో, కులాలతో సంబంధం లేకుండా  కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  50 ఏండ్లు అధికారం ఇచ్చినా ఏమిచేయని దుర్మార్గులు కొందరు.. కులమతాలతో అల్లర్లకు కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇందిరాపార్క్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో హైదరాబాద్ లో కర్ఫ్యూ ఉండేదని..ఇపుడు ఆ పరిస్థితి లేదన్నారు.
ఇందిరా పార్క్ నుంచి VST వరకు 2.63 కిలోమీటర్ల మేర నిర్మించిన  స్టీల్ ఫ్లైఓవర్ ను  మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.  426 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ ను జీహెచ్ఎంసీ నిర్మించింది.  81 పిల్లర్లపై స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేశారు.  ఈ ఫ్లై ఓవర్ నిర్మించడం లో 12,316 మెట్రిక్ టన్నులు స్టీల్ ఉపయోగించారు.  స్టీల్ ఫ్లై ఓవర్ కు నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టారు. నగరంలోనే మెట్రో ట్రాక్ పై నుండి నిర్మించిన తొలి ఫ్లై ఓవర్.   అత్యధిక ఎత్తులో ఈ స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు.  2020 జూలైలో శంకుస్థాపన  చేయగా..  మూడు సంవ్సరాలు పట్టింది.

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్