ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయిందని చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యమత పాలన పోయి .. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందన్నారు. గత పాలకులకు నిలువు నామాలతో పంగనామాలు పెట్టారని… ఎర్రచందనం దోపిడీతో సర్కారుకే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారని ఆరోపించారు. శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని చెప్పారు. నాస్తికులకు, అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని విమర్శించారు. నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులు- బండి సంజయ్
0
286
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


